కేరళలో రికార్డుస్థాయిలో కేసులు నమోదు
పోయిందనుకున్న కరోనా కేరళలో మళ్ళీ పంజా విసురుతోంది. ఇప్పటివరకు రానివిధంగా ఒకేరోజులో అత్యధికంగా 138 COVID-19 కేసులు నమోదయ్యాయి,
పోయిందనుకున్న కరోనా కేరళ లో మళ్ళీ పంజా విసురుతోంది. ఇప్పటివరకు రానివిధంగా ఒకేరోజులో అత్యధికంగా 138 COVID-19 కేసులు నమోదయ్యాయి,దీంతో రాష్ట్రంలో మొత్తం అంటువ్యాధుల సంఖ్య 3,308 కు చేరుకుంది. కేరళలో 138 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని, వీరిలో 87 మంది విదేశాల నుంచి, 47 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని, నలుగురు తమ పరిచయాల ద్వారా ఈ వ్యాధి బారిన పడ్డారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలజ తెలిపారు.
కాగా జూన్ 19న 118, జూన్ 20 న 127 , ఆదివారం 133 నమోదయ్యాయి. 100 కి పైగా అంటువ్యాధులు నమోదవ్వడం ఇది వరుసగా నాల్గవసారి. కేసుల సంఖ్య పెరగడంతో, రాష్ట్రంలో మరో నాలుగు ప్రాంతాలను హాట్ స్పాట్లు గా ప్రభుత్వం ప్రకటించింది, దీంతో హాట్ స్పాట్ల సంఖ్య112 కు చేరింది. కొత్తగా 88 మంది కోలుకున్నారు.