Veena George: రోడ్డు ప్రమాదంలో కేరళ ఆరోగ్యమంత్రికి గాయాలు..వయనాడ్ కు వెళ్తుండగా ఘటన
Veena George: కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మలప్పురంలోని మంచిరిలో వీణా జార్జ్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మంత్రికి గాయాలయ్యాయి.
Veena George:కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మలప్పురంలోని మంచిరిలో వీణా జార్జ్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మంత్రికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. వయనాడ్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.
కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం మలప్పురం జిల్లాలో ప్రమాదానికి గురయ్యారు. మలప్పురంలోని మంచిరిలో వీణా జార్జ్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మంత్రి వీనా జార్జ్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఎడమ చేతికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కొండచరియలు విరిగిపడిన జిల్లా వాయనాడ్‌లో ఆరోగ్య మంత్రి పర్యటించనున్నారు. ఈ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వాయనాడ్ కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, గాయపడిన వారిని ఆమె పరామర్శించేందుకు వెళుతున్నారు. వీణా జార్జ్‌కు స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.