కేరళలో తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. కార్లకు సరి-బేసి విధానం

రెండోవి విడత లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాల్లో కార్యకలాపాలకు మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే.

Update: 2020-04-19 08:08 GMT
Representational Image

రెండోవి విడత లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాల్లో కార్యకలాపాలకు మినహాయింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా పలు రాష్ట్రాలు వీటికి అనుగుణంగా ఏర్పాట్లను చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో సోమవారం నుండి, కేరళలోని 14 జిల్లాల్లో కనీసం ఏడు ప్రాంతాలకు రెస్టారెంట్లు పునప్రారంభం కానున్నాయి. వాటితో పాటు బేసి-ఈవెన్ పథకం కింద పరిమిత సంఖ్యలో ప్రైవేట్ వాహనాలను నడపడానికి అనుమతించనుంది.

సోమవారం, బుధవారం, శుక్రవారం సరి సంఖ్య వాహనాలు, మంగళవారం, గురువారం, శుక్రవారం బేసి సంఖ్య వాహనాలను అనుమతించనున్నట్టు తెలిపింది. కేవలం క్లిష్టమైన సేవలు, అత్యవసర సర్వీసులకు మాత్రమే మినహాయింపు ఉంటుంది. వాహనాలు నడిపే మహిళా డ్రైవర్లకు కూడా అనుమతిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కారులో ముగ్గురు (డ్రైవర్ సహా వెనుక సీట్లలో ఇద్దరు), ద్విచక్రవాహనంపై నడుపుతున్న వ్యక్తితోపాటు కుటుంబసభ్యుడికి మాత్రమే అవకాశం ఉంది.

ఇక కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మహమ్మారి వ్యాప్తి చెందిన రెండు నెలల తరువాత, రాష్ట్రంలో 396 కేసులు మరియు మూడు మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.



Tags:    

Similar News