KCR: మరికాసేపట్లో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కేసీఆర్ భేటీ
KCR: గెజిట్ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను వివరించనున్న సీఎం *అనుమతులేని ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయనున్న సీఎం కేసీఆర్
KCR: కృష్ణా జలాల పంచాయితీ కేంద్రం దగ్గరకు వెళ్లింది. తెలుగు రాష్ట్రాల జలవివాదంపై సాయంత్రం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కేసీఆర్ చర్చించనున్నారు. గెజిట్ నోటిఫికేషన్‌పై జలశక్తి శాఖ మంత్రికి వివరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అనుమతిలేని ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేయనున్నారు. బేసిన్ అవతల ఉన్న ప్రాంతాలకు నీటిని తరలించడంపై కంప్లైంట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
కృష్ణా జలాల్లో 50 శాతం వాటాకావాలని పట్టుబడుతున్న సీఎం కేసీఆర్ శ్రీశైలం నుంచి జలాలను హంద్రీనీవాకు తరలించొద్దని కోరనున్నట్లు సమాచారం. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రమంటోంది. అదేవిధంగా తెలంగాణలో నూతన ప్రాజెక్టులకు అనుమతులు కోరనున్నారు సీఎం కేసీఆర్.