Bengaluru: కర్ణాటక సీఎల్పీ భేటీ.. సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ

Bengaluru: ప్రారంభమైన కర్ణాటక సీఎల్పీ సమావేశం

Update: 2023-05-14 13:06 GMT

Bengaluru: కర్ణాటక సీఎల్పీ భేటీ.. సీఎం అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ 

Bengaluru: కర్ణాటక సీఎల్పీ భేటీ ప్రారంభమైంది. సీఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణకు పరిశీలకులను హైకమాండ్ నియమించింది. ఇప్పటికే సుశీల్ కుమార్ షిండే టీమ్ బెంగళూరు చేరుకుంది. సుర్జేవాలా,కేసీ వేణుగోపాల్‌తో సుశీల్ కుమార్ షిండే టీమ్ భేటీ అయింది. ఒక్కో ఎమ్మెల్యేతో పరిశీలకులు సమావేశం నిర్వహించనున్నారు. ముఖాముఖీ సమావేశమై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోనున్నారు. తర్వాత సీఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియలో షిండే పాల్గొననున్నారు. అయితే పరిస్థితిని బట్టి ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు షంగ్రిల్లా హోటల్‌కు రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు సైతం చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇప్పటికే ప్రెసిడెంట్ ఖర్గే సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సీఎంను ఎన్నుకునేందుకు పరిశీలకుల బృందాన్ని నియమించినట్లు ఖర్గే తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే సీఎంను ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిశీలకులు తీసుకుని హైకమాండ్‌కు నివేదిస్తారని చెప్పారు.

ఇటు డీకే శివకుమార్ వైపే మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. 30 మంది ఎమ్మెల్యేలు సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటే.. మరో 30 మంది ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్వలేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటు వక్కళిగ వర్గానికి చెందిన మఠాధిపతులు సైతం డీకే శివకుమార్ సీఎం కావాలని కోరుకున్నారు. దీంతో సీఎంగా ఎవరు ఖరారవుతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.  

Tags:    

Similar News