JEE Main 2025 Schedule: జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షల షెడ్యూల్ రిలీజ్..పూర్తి వివరాలివే

JEE Main 2025 Schedule: NITల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షల షెడ్యూల్ ఎన్టీఏ రిలీజ్ చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ కూడా షురూ అయ్యాయి. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు ఈన్ లైన్ విధానంలో నవంబర్ 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం.

Update: 2024-10-29 04:45 GMT

JEE Main 2025 Schedule: దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2025 తొలి విడత పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. ఈ మేరకు ఎన్టీఏ సోమవారం షెడ్యూల్ ను విడుదల చేసింది. 2025-26 విద్య సంవత్సరానికి గాను రెండు సెషన్స్ చొప్పున జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది.

దీనిలో మొదటి సెషన్ పరీక్షలు జనవరి 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 28 నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం అవుతాయి. నవంబర్ 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. నవంబర్ 22వ తేదీ రాత్రి 11.50 గంటల్లోకా ఫీజు చెల్లించేందుకు గడువును నిర్ణయించారు. జనవరి మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను ప్రకటిస్తుంది. పరీక్షకు మూడు రోజులు ముందుగా ఎన్టీఏ వెబ్ సైట్లో అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయి.

ఇక జేఈఈ మెయిన్ సిలబస్ లో ఎలాంటి మార్పులు లేవు. జనవరి 22 నుంచి 31 వరకు జేఈఈ మెయిన్ సెషల్ 1 పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9గంటల నుంచి 12 గంటలకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు రెండు షిఫ్టుల చొప్పున ఆన్ లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇక ఫిబ్రవరి 12న తుది ఫలితాలను వెల్లడించనున్నారు. జేఈఈ మెయిన్స్ ను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రా నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేస్తున్నట్లు సమాచారం. 

Tags:    

Similar News