ISRO: మరో ఘనత సాధించిన ఇస్రో
ISRO: మూడోసారి RLV ల్యాండింగ్ ప్రయోగం సక్సెస్
ISRO: ఇస్రో మరో ఘనత సాధించింది. స్వదేశీ అంతరిక్ష నౌకగా పిలుచుకునే పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి ఎస్‌యూవీ తరహా రాకెట్‌ను ప్రయోగించింది ఇస్రో. గాలిలోకి ఎగిరిన తర్వాత రాకెట్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. రీయూజబుల్ లాంచ్ వెహికల్ తయారీ భారతదేశ చరిత్రలో మరో మైలురాయి అని ఇస్రో పేర్కొంది. ప్రయోగంలో భాగంగా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ నుంచి పుష్పక్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇస్రో ప్రకటించింది.
ఇస్రో రూపొందించిన రీయూజ్‌డ్ లాంచింగ్ వెహికిల్‌ను ఇండియన్ నేవీ హెలికాప్టర్ ద్వారా నాలుగున్నర కిలోమీటర్ల ఎత్తు నుంచి వదిలి పెట్టింది. ఈ వెహికిల్‌లోనే రేంజ్‌ని కూడా మేనేజ్ చేసే సిస్టమ్ ఉండటంతో.. ఆటోమెటిక్‌గా రన్‌వేకు చేరుకుంది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్‌ల సాయంతో వెహికిల్ రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే రీయూజ్‌డ్ లాంచింగ్ వెహికిల్ ల్యాండింగ్ వేగం.. సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కంటే అధికం.
కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ 260 కిలోమీటర్ల వేగంతో ల్యాండ్ అయితే... 320 కిలోమీటర్ల వేగంతో పుష్పక్ రాకెట్ రన్‌వేపైకి దూసుకొచ్చింది. స్పేస్ రీసెర్చ్‌కు వినియోగించిన రాకెట్‌లను తిరిగి వినియోగించే విధంగా రీయూజ్‌డ్ లాంచింగ్ వెహికిల్ రూపొందిస్తోంది ఇస్రో. ఈ క్రమంలోనే హైస్పీడ్‌లోనూ రాకెట్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యేలా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయోగించారు.