IRCTC: ఇకనుంచి ఈ రైళ్లలో శాఖాహారం మాత్రమే..!

IRCTC: IRCTC: భారతీయ రైల్వేలలో నిత్యం మార్పులు సంభవిస్తూనే ఉంటాయి.

Update: 2021-11-14 12:00 GMT

ఇకనుంచి ఈ రైళ్లలో శాఖాహారం మాత్రమే (ఫైల్ ఇమేజ్)

IRCTC: భారతీయ రైల్వేలలో నిత్యం మార్పులు సంభవిస్తూనే ఉంటాయి. జనాలకు ఏది అవసరమో దాని ప్రాతిపదికన రైల్వే అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటమే వీరి లక్ష్యం. అయితే కరోనా వల్ల రైల్వే శాఖ చాలా నష్టపోయినప్పటికీ ఇప్పుడిప్పుడే కొత్త రైళ్లను ప్రవేశపెడుతోంది. దీంతో పాటుగా మరికొన్ని నూతన సౌకర్యాలను కల్పిస్తుంది. తాజాగా రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసి సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో కొన్ని రైళ్లలో శాఖాహారం మాత్రమే అందిస్తామని ప్రకటించింది. అయితే అది ఏ రైళ్లలో అనేది తెలుసుకుందాం.

IRCTC కొన్ని రైళ్లను 'సాత్విక్ సర్టిఫైడ్' పొందడం ద్వారా 'వెజిటేరియన్ ఫ్రెండ్లీ ట్రావెల్'ని ప్రోత్సహించాలని యోచిస్తోంది. ఎంపిక చేసిన మార్గాల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. IRCTC ఇలా రైళ్లలో శాఖాహారం అందించడం ఇదే మొదటిసారి. సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మతపరమైన ప్రదేశాలకు వెళ్లే రైలు మార్గాలలో శాఖాహార ఆహార సేవలను ప్రారంభించడానికి IRCTCతో ఒప్పందం కుదుర్చుకుంది.'సాత్విక్' సర్టిఫికేట్ పొందే అవకాశం ఉన్న మొదటి రైలు ఢిల్లీ నుంచి కత్రా వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్. ఢిల్లీ-కత్రా రైలు చివరి స్టాప్ వైష్ణో దేవి ఆలయం.

అలాగే కొత్తగా ప్రారంభించిన రామాయణ ఎక్స్‌ప్రెస్‌తో సహా మరో 18 రైళ్లలో ఈ ఫార్ములాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తున్నారు. కాశీ మహాకాల్ ఎక్స్‌ప్రెస్‌లో ఈరోజు నుంచి ఈ ఫార్ములా ప్రారంభం కానుంది. ఈ రైలు వారణాసి నుంచి ఇండోర్ మధ్య నడుస్తుంది. ఐఆర్‌సిటిసి బేస్ కిచెన్‌లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, బడ్జెట్ హోటల్‌లు, ఫుడ్ ప్లాజాలు, ట్రావెల్ అండ్ టూర్ ప్యాకేజీలు, రైల్ నీర్ ప్లాంట్‌లు 'సాత్విక్' సర్టిఫికేట్ పొందుతాయని సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అలాగే శాఖాహార వంటశాలలపై హ్యాండ్‌బుక్‌ను కూడా విడుదల చేయనున్నట్లు తెలిపింది.

Tags:    

Similar News