Indian Railway: రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు

Indian Railway: ఎయిర్‌పోర్ట్స్‌ తరహా కమర్షియల్‌ స్పేస్‌కు ప్రణాళికలు * ప్రయాణికులకు సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం

Update: 2021-03-19 04:27 GMT

ఇండియన్ రైల్వేస్ (ఫైల్ ఫోటో)

Indian Railway: రైల్వే మారుతోంది. భారీ ఆదాయాన్ని సమకూర్చుకునే దారులు వెతుక్కుంటోంది. పాత విధానాల్ని మార్చే దిశగా అడుగులేస్తోంది. నేరుగా కాకుండా పరోక్షంగా ప్రైవేటీకరణ దిశగా పయనిస్తోంది. రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల్లా తీర్చిదిద్దుతూ ఆదాయాన్ని పెంచుకునేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.

దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. దీంతో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ మాదిరి కమర్షియల్‌ స్పేస్‌కు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రయాణికులకు కొంత సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రైల్వేశాఖ పాత విధానాలను మార్చేదిశగా అడుగులు వేస్తోంది. నేరుగా కాకుండా పరోక్షంగా ప్రైవేటీకరణ దిశగా పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో లక్ష చదరపు మీటర్లమేర కొత్త నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రధానంగా ఐఆర్‌ఎస్‌డీసీ స్టేషన్‌లో కొత్త ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగా ఒకటో నెంబర్‌ ప్లాట్‌ఫామ్‌ నుండి 10వ నెంబర్‌ ఫ్లాట్‌ఫామ్‌కి మెట్రో రైల్వేతో అనుసంధానం చేయనుంది. అదేవిధంగా ఫ్లామ్‌ఫామ్‌ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో విశాలమైన భవన సముదాయాన్ని నిర్మించనుంది. ప్రస్తుతం ఉన్న భవనాలపై నిర్మాణం చేపట్టనుంది.

చెప్పాలంటే ఇకపై రైల్వేస్టేషన్‌లో పూర్తిగా విమానాశ్రయ లెవల్లో అరైవల్‌, డిస్పాచర్‌లు వేరువేరుగా ఉంటాయి. టికెట్‌ కౌంటర్లు, ఖాళీ స్థలంలో పెద్దపెద్ద భవనాలు, హోటళ్లు, గేమింగ్‌ జోన్‌ ఏర్పాటుకానున్నాయి. అయితే వీటి వల్ల ప్రజలకు ఏం ప్రయోజనమంటున్న రైల్వే యూనియన్‌ నేతలు కొత్త నిర్మాణాల ఖర్చును భారాన్ని ప్రయాణికులపై మోపుతారంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రైల్వేస్టేషన్లలో చేపట్టే నిర్మాణాలను ప్రజలు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదంటున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, ఆదాయం సమకూర్చడం పేరుతో రైల్వేస్టేషన్లను పీపీఈ పద్ధతిలో ప్రైవేట్‌కు అప్పగించడం పట్ల వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News