Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ విషయంలో చింతవద్దు..?
Indian Railways: రైలులో ప్రయాణించే వారికి ఒక ముఖ్యమైన వార్త.
Indian Railways: రైలులో ప్రయాణించే వారికి ఒక ముఖ్యమైన వార్త. ఇప్పుడు ప్రయాణికుల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల కొన్ని రోజులు రైలులో ప్యాంట్రీ సౌకర్యం క్లోజ్ చేశారు. ఇది ఇప్పుడు ప్రారంభించారు. కానీ నాణ్యత లేని ఆహారం కారణంగా ప్రయాణికుల నుంచి చాలా కంప్లెయింట్స్ వస్తున్నాయి. అందువల్ల రైలులో సాధారణ ఆహారాన్ని తనిఖీ చేయాలని రైల్వే నిర్ణయించింది. ఇందుకోసం 50 ఎఫ్‌ఎస్‌ఎస్ (ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్)న నియమించనుంది.
ప్రయాణీకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఇప్పుడు ఆహారాన్ని క్రమం తప్పకుండా తనిఖీ చేస్తుంది. అంతే కాదు ఏదైనా కంప్లెయింట్ వస్తే వెంటనే చర్యలు తీసుకుంటుంది. IRCTC బేస్ కిచెన్‌లో ఆహార నాణ్యతను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించింది. ఇందుకోసం ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్లను ప్రత్యేకంగా నియమించనున్నారు. అదే సమయంలో ఆహార ఉత్పత్తుల పరీక్ష కోసం ప్రైవేట్ ల్యాబ్‌ల సహాయం కూడా తీసుకుంటారు. వాస్తవానికి ప్రయాణికుల సంతృప్తి కోసం రైల్వేశాఖ చాలా ప్రయత్నిస్తోంది. లోపాలని సవరిస్తూ వస్తోంది.
రైళ్లలో లభించే ఆహారంపై ప్రయాణికుల నుంచి తరచూ ఫిర్యాదులు వస్తుండటంతో పాతవారిని తొలగించేకు కూడా రైల్వే సిద్ధమైంది. అందుకే రైల్వే తరపున ఎఫ్‌ఎస్‌ఎస్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం 50 ఎఫ్‌ఎస్‌ఎస్‌ల విస్తరణ కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. కరోనా కాలానికి ముందు IRCTCలో 46 బేస్ కిచెన్‌లు ఉన్న విషయం తెలిసిందే. ప్రతి వంటగదిలో కనీసం ఒక ఫుడ్ సేఫ్టీ సూపర్‌వైజర్ ఉంటారు. వంటగదిలో తయారుచేసిన ఆహారం నాణ్యతగా ఉండేలా చూసుకోవడం అతని బాధ్యత. మరోవైపు రైల్వే స్టేషన్లు, రైళ్లలో లభించే ఆహారంపై ప్రయాణికులు ఎంత సంతృప్తిగా ఉన్నారనే దానిపై ఓ ప్రైవేట్ ఏజెన్సీ సర్వే నిర్వహించనుంది.