Kathua: కథువా దాడికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం.. భారత్ వార్నింగ్
Kathua: కథువా ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది.
Kathua: కథువా ఉగ్రదాడి ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ దాడికి ప్రతీకారం తప్పక తీర్చుకుంటామని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ స్పష్టం చేశారు. దాడి వెనుక ఉన్న దుష్ట శక్తులను విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. ఉగ్రదాడిలో అమరులైన సైనిక కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్ముకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో భారత సైనికులు జరిపిన ఎన్‌కౌంటర్లపై ఉగ్రవాదులు ప్రతీకార దాడికి పూనుకున్నారు. భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు జవాన్లు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో ఉగ్రవాదులు కొండపై నుంచి గ్రనేడ్లు, ఇతర మారణాయుధాలతో ఈ దాడి చేశారు. వెంటనే తేరుకున్న సైనికులు ఎదురుకాల్పులు జరుపగా, ఉగ్రవాదులు పారిపోయారు. వారి కోసం గాలింపు జరుగుతున్నది.