Monekypox: క్లేడ్ 1 మంకీపాక్స్.. భారత్‌లో తొలి కేసు నమోదు
Monekypox Clade 1B Strain: భారత్‌లో మంకీపాక్స్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. హెల్త్ ఎమర్జెన్సీకి దారి తీసిన క్లేడ్ 1బీ స్ట్రెయిట్‌గా దీన్ని గుర్తించారు.
Monekypox: భారత్‌లో మంకీపాక్స్‌కు సంబంధించి మరో కేసు నమోదైంది. హెల్త్ ఎమర్జెన్సీకి దారి తీసిన క్లేడ్ 1బీ స్ట్రెయిట్‌గా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో గత వారం ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
కేరళలోని మలప్పురానికి చెందిన 38ఏళ్ల వ్యక్తి UAE నుంచి ఇటీవల వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు జరిపగా... క్లేడ్ 1గా నిర్ధరణ అయింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.