ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష భేటీ..

చైనాతో ఉద్రిక్తత, గాల్వన్‌లో 20 మంది భారతీయ సైనికుల మరణాల అంశంపై ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 20 పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Update: 2020-06-19 13:18 GMT

చైనాతో ఉద్రిక్తత, గాల్వన్‌లో 20 మంది భారతీయ సైనికుల మరణాల అంశంపై ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 20 పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో అమరవీరులైన సైనికులకు నివాళి అర్పించారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఈ సమావేశానికి ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీలను ఆహ్వానించలేదు.

వార్తా సంస్థ ANI లోని వర్గాల సమాచారం ప్రకారం, నాలుగు ప్రమాణాల ఆధారంగా సమావేశాలకు ఆహ్వానాలు ఇవ్వబడ్డాయి. అందులో మొదటిది అన్ని జాతీయ పార్టీలు. రెండు- లోక్‌సభలో 5 మంది ఎంపీలున్న పార్టీలు. మూడు- ఈశాన్య రాష్ట్రాల ప్రధాన పార్టీలు. నాలుగు- కేంద్ర మంత్రివర్గంలో నాయకులు ఉన్న పార్టీలు. దీని ఆధారంగా అఖిలపక్ష సమావేశానికి 20 పార్టీలను మోదీ ఆహ్వానించారు.

Tags:    

Similar News