కెనడాలోని భారత పౌరులు తస్మాత్ జాగ్రత్త.. విదేశాంగ శాఖ హెచ్చరిక..

Canada: కెనడాలో ఇటీవల జరిగిన విద్వేషాల నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది.

Update: 2022-09-24 09:15 GMT

కెనడాలోని భారత పౌరులు తస్మాత్ జాగ్రత్త.. విదేశాంగ శాఖ హెచ్చరిక..

Canada: కెనడాలో ఇటీవల జరిగిన విద్వేషాల నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో అక్కడి భారత పౌరులు అప్రమత్తంగా ఉండాలంటూ భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. కెనడాలో జరిగిన ద్వేశపూరిత ఘటన గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించామని విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని, సత్వరమే నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.

కొంతకాలంగా కెనడాలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో అక్కడి భారత జాతీయులు, విద్యార్థులు, అక్కడికి వెళ్లాలనుకుంటున్న వారు జాగ్రత్తలు పాటించాలని విదేశాంగ శాఖ సూచించింది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం ఓ వర్గమే లక్ష్యంగా హింస వంటివి ఆ దేశంలో పెచ్చుమీరాయని తెలిపింది ఖలిస్థానీ వేర్పాటువాదులు టొరంటోలోని శ్రీ స్వామి నారాయణ్ మందిర్, విష్ణు మందిర్ పై దాడి చేశారు. ఆలయ గోడలపై భారత వ్యతిరేక రాతలు రాశారు. అక్కడి హిందూ దేవాలయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్నాయని ఆ దేశ ఎంపీ ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగా శాఖ అక్కడి భారత పౌరులను పలు సూచనలు చేసింది. 

Tags:    

Similar News