Tamil Nadu Polls: అమ్మాయి పుడితే లక్ష డిపాజిట్
Tamil Nadu Polls: తనను గెలిపిస్తే.. తన నియోజకవర్గంలో అమ్మాయి పుడితే లక్ష డిపాజిట్ చేస్తానని కుష్బూ ప్రకటించారు.
Tamil Nadu Polls: తమిళనాడు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు గెలుపు కోసం హామీలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడానికి నేతలు ఎన్నికల ప్రచారంలో చేసే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ మధ్య అన్నాడీఎంకే నేత ఒకరు ఒక ఇంట్లోకి వెళ్లి బట్టలు ఉతికి, వాటిని నీళ్లతో శుభ్రం చేసి దండెంపై ఆరేశారు. తాను గెలిస్తే ఉచితంగా వాషింగ్ మిషన్లు ఇస్తామని హామీ కూడా ఇచ్చిన విషయం మన చూశాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ధౌజండ్ లైట్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నకుష్బూ.. తనను గెలిపిస్తే.. తన నియోజకవర్గంలో అమ్మాయి పుడితే బ్యాంకులో లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానని ప్రకటించారు. గతంలోనూ వివిధ పార్టీల నుండి ఎన్నిక బరిలో నిలిచిన ఆమెను విజయం వరించలేదు. ఈ క్రమంలో ఆమె శనివారం తన నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సందర్భంగా కుష్బూ మాట్లాడుతూ.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ముఖ్యమని అన్నారు. తన నియోజకవర్గంలో ఆడపిల్లలు పుడితే.. వెంటనే వారి పేరు మీద లక్ష రూపాయలు బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆడపిల్లలకు సహాయం అందించాలని.. తద్వారా బ్రూణ హత్యలను నివారించవచ్చని ఆమె అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె ఓ టిఫిన్ సెంటర్ దగ్గర దోశలు వేశారు. మరి ఈ ఎన్నికల్లో కుష్బూను విజయం వరిస్తుందో లేదో చూడాలి. నుంగంబాక్కంలోని వెస్ట్ మాడా వీధిలో ప్రచారం సాగించిన ఖుష్బూ అక్కడి ఓ రెస్టారెంట్‌ను చూడగానే కొద్దిసేపు ఆగారు. వంటలో తనకు ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్షణాల్లో పెనంపై వేడివేడి దోసెలు సిద్ధం చేశారు. దీంతో ఆమెను చూడడానికి జనం ఎగబడ్డారు. కుష్బూ పేరుతో ఇప్పటికే తమిళనాట కుష్బూ ఇడ్లీలు పాపులర్ అయ్యాయి. ఖుష్బూ అభిమానులు గతంలో ఆమెకు గుడి కూడా కట్టించిన విషయం తెలిసిందే.