NPS నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయాలంటే ఎలా..? నిబంధనలు, షరతులు ఏంటి..

*డబ్బులు విత్‌డ్రా కోసం PFRDA సగటు 80:20 నియమాన్ని కలిగి ఉంది.

Update: 2021-11-19 03:03 GMT

నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఫైల్ ఫోటో)

NPS: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) ఉద్యోగ విరమణ, దీర్ఘకాలిక పెట్టుబడి కోసం ఒక గొప్ప ఎంపిక. ఇందులో ఖాతాదారులకు ముందస్తు ఉపసంహరణ, నిష్క్రమణ అవకాశం కల్పించారు. NPSలో ప్రధానంగా రెండు రకాల ఖాతాలు ఉంటాయి. మొదటిది టైర్-1 కాగా రెండో టైర్-2 ఖాతా. టైర్-2 ఖాతా అకాల ఉపసంహరణకు సంబంధించినది. డబ్బులు విత్‌డ్రా కోసం PFRDA సగటు 80:20 నియమాన్ని కలిగి ఉంది.

ఇది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఎవరైనా 18-60 సంవత్సరాల మధ్య NPSలో చేరి మధ్యలో డబ్బులు విత్‌ డ్రా చేస్తానంటే ఫండ్‌లో 20 శాతం మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. 80 శాతం పెన్షన్ స్కీమ్ కొనుగోలుకు ఉపయోగించాల్సి ఉంటుంది.

ఈ మేరకు సెప్టెంబర్‌లో పెన్షన్ రెగ్యులేటర్ పీఎఫ్‌ఆర్‌డీఏ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 21, 2021న PFRDA జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం పెన్షన్ ఫండ్ కార్పస్ 2.5 లక్షల కంటే తక్కువగా ఉంటే మొత్తం ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.

నిబంధనల ప్రకారం 60 ఏళ్ల తర్వాత నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి విత్‌ డ్రా చేసుకోవచ్చు. దీనికి ముందు విత్‌ డ్రా చేసే దానిని ప్రీ-మెచ్యూర్ ఎగ్జిట్ అంటారు. మీరు 60 ఏళ్లు పూర్తయిన తర్వాత కార్పస్ ఫండ్ 5 లక్షల వరకు ఉంటే అప్పుడు కూడా మొత్తం డబ్బులను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు. కార్పస్ 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే గరిష్టంగా 60 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. అందులో 40 శాతం పెన్షన్ కోసం ఉపయోగించాల్సి ఉంటుంది.

ఒకవేళ చందాదారుడు మధ్యలోనే మరణిస్తే నామినీకి మొత్తం డబ్బులు చెల్లిస్తారు. సబ్‌స్క్రైబర్ ప్రభుత్వ ఉద్యోగి అయితే కార్పస్ 5 లక్షల కంటే తక్కువ ఉంటే నామినీకి మొత్తం డబ్బులు అందుతాయి. కార్పస్ 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే అందులో 80 శాతం పెన్షన్ కోసం ఉపయోగిస్తారు. మిగిలిన 20 శాతాన్ని ఒకేసారి ఇస్తారు. ఇప్పటివరకు ఎవరైనా ఉద్యోగులు ఈ స్కీంలో చేరకపోతే వెంటనే చేరండి. దీర్ఘకాలిక ప్రయోజనాలకు చక్కగా ఉపయోగపడుతుంది.

Tags:    

Similar News