ఎయిర్ ఇండియా విమానాలపై హాంగ్‌కాంగ్ మరోసారి నిషేధాన్ని విధించింది. భారత్ నుంచి వస్తున్న కొందరు ప్రయాణికులకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాపై హాంకాంగ్ బ్యాన్ విధించడం ఇది నాలుగోసారి. ఐతే తాజా నిషేధం నవంబర్ 10వరకు అమల్లో ఉంటుంది. భారత్ నుంచి హాంగ్‌కాంగ్ వచ్చే ప్రయాణికులు ప్రయాణానికి 72గంటల ముందుగా కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఇస్తేనే అనుమతిస్తామని ఆ దేశం ఆదేశాలు జారీచేయగా ఎయిర్‌పోర్టులో పరీక్షలు నిర్వహిస్తోంది. ఐతే ముంబై నుంచి వెళ్లిన ప్రయాణికులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆ దేశ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.