Rahul Gandhi: హిందూ సమాజం అంటే ప్రధాని మోడీ ఒక్కరు మాత్రమే కాదు
Rahul Gandhi: హిందూ సమాజం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే కాదు
Rahul Gandhi: హిందుత్వంపై లోక్‌సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. లోక్‌సభలో శివుడు ఫొటోను చూపిస్తూ మాట్లాడారు రాహుల్. శివుడి ఎడమ చేతి వెనకాల త్రిశూలం ఉంటుంది. త్రిశూలం అనేది హింసకు చిహ్నం కాదు. హింసకు చిహ్నం అయితే కుడి చేతిలో త్రిశూలం ఉండేది, తాను శివుడి నుంచి ప్రేరణ పొందాను అన్నారు రాహుల్. హిందూ సమాజం అంటే ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే కాదని, ఈ సభలో, బయట ఉన్నవారంతా హిందువులే అన్నారు. ఐతే లోక్‌సభలో రాహుల్ గాంధీ... శివుడి ఫొటోను చూయించడంపై స్పీకర్ అభ్యంతరం తెలిపారు. శివుడి ఫొటో, రాజ్యాంగాన్ని చూపిస్తే తప్పా అని ప్రశ్నించారు రాహుల్.