Hemant Soren: జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్

Hemant Soren: హేమంత్ సోరెన్‌కి అనుకూలంగా 45 మంది సభ్యుల ఓటు

Update: 2024-07-08 16:45 GMT

Hemant Soren: జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్

Hemant Soren: జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో JMM నేత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించింది. 81 మంది చట్టసభ సభ్యులకు గానూ 45 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో విపక్షాలు వాకౌట్ చేశాయి. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిల్‌పై విడుదలైన హేమంత్‌.. 5 నెలల తర్వాత మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆ కేసులో జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్‌ సోరెన్‌ను అరెస్టు చేశారు. హేమంత్‌కు హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరుచేయడంతో జూన్‌ 28న జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. అనంతరం చంపయీ రాజీనామా చేయడం... హేమంత్‌ మూడోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చకచకా సాగిపోయాయి.

Tags:    

Similar News