UNESCO: యునెస్కో జాబితాలో మరో చారిత్రక కట్టడం

UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రాచీన కట్టడం గుర్తింపు నిచ్చిన తర్వాత చరిత్ర ప్రసిద్ధి పొందిన భారతీయ ప్రాచీన కట్టడాలపై ప్రపంచం దృష్టి పడుతోంది.

Update: 2021-07-27 13:27 GMT

UNESCO: యునెస్కో జాబితాలో మరో చారిత్రక కట్టడం

UNESCO: రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రాచీన కట్టడం గుర్తింపు నిచ్చిన తర్వాత చరిత్ర ప్రసిద్ధి పొందిన భారతీయ ప్రాచీన కట్టడాలపై ప్రపంచం దృష్టి పడుతోంది. హరప్పా నాగరికత నాటి పట్టణంగా గుర్తింపు పొందిన ధోలవీరాను ప్రపంచ ప్రాచీన కట్టడంగా గుర్తిస్తూ యునెస్కో ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ లోని రాన్ ఆఫ్ కచ్ దగ్గరున్న ధోలవీరాను 1800 బీసీ లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. 1967లో ఆర్కియలాజికల్ సర్వే పురావస్తు తవ్వకాల్లో ధోలావీరా నిర్మాణం బయటపడింది. ధోలావీరాకు యునెస్కో గుర్తింపుతో ఇప్పటి వరకూ భారత్ కు చెందిన 40 చారిత్రక నిర్మాణాలకు యునెస్కో గుర్తింపు దక్కినట్లయింది.

హరప్పా సంస్కృతి, నాగరికత ఆధారంగా రూపొందిన కట్టడం ధోలావీరా అప్పట్లో వర్షాధారిత వ్యవసాయ సాగుకు అనుకూలంగా ఈ కట్టడాన్ని నిర్మించారు. ఉప గ్రహ ఛాయా చిత్రాల్లో అక్కడొక రిజర్వాయర్ ఉన్నట్లుగా బయటపడింది. అంతేకాదు హరప్పా నాగరికతలో టెర్రాకోటా మట్టి వస్తువులు, బీడ్స్, రకరకాల పురాతన వస్తువులు బయటపడ్డాయి.

Tags:    

Similar News