ఆ రిపోర్టులు వచ్చేవరకు ఆగొద్దు: అమిత్‌ షా

కరోనా పరీక్షల రిపోర్టులు వచ్చేంత వరకు ఆగకుండా ఢిల్లీలోని కరోనా వైరస్‌ అనుమానితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు వెంటనే అప్పగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అధికారులను ఆదేశించారు.

Update: 2020-06-15 08:16 GMT

కరోనా పరీక్షల రిపోర్టులు వచ్చేంత వరకు ఆగకుండా ఢిల్లీలోని కరోనా వైరస్‌ అనుమానితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు వెంటనే అప్పగించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అంత్యక్రియలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో కోవిడ్‌-19 విస్తరణపై ముఖ్యమంత్రి కేజ్రివాల్‌, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్ ‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు అమిత్‌ షా. మరోవైపు ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో టెస్టుల సంఖ్య కూడా పెంచాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన విధంగా కేంద్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేస్తుందని అన్నారు. కాగా ఢిల్లీలో ఆదివారం ఒక్కరోజే దాదాపు 2,224 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 56 మంది మరణించారు.


Tags:    

Similar News