Akhilesh Yadav: అందుకే పేప‌ర్ లీకేజీలు అవుతున్నాయి

Akhilesh Yadav: ఈవీఎంల‌పై నిన్న కూడా న‌మ్మకం లేద‌ని, ఇవాళ కూడా ఆ న‌మ్మకం లేద‌ని, ఒక‌వేళ త‌మ పార్టీ 80 సీట్లు గెలిచినా..

Update: 2024-07-02 11:30 GMT

Akhilesh Yadav: అందుకే పేప‌ర్ లీకేజీలు అవుతున్నాయి

Akhilesh Yadav: ఈవీఎంల‌పై నిన్న కూడా న‌మ్మకం లేద‌ని, ఇవాళ కూడా ఆ న‌మ్మకం లేద‌ని, ఒక‌వేళ త‌మ పార్టీ 80 సీట్లు గెలిచినా.. అప్పుడు కూడా ఆ ఈవీఎంల‌పై భ‌రోసా లేద‌ని, ఈవీఎంల‌తో గెలిచినా.. ఆ ఈవీఎంల‌ను తొల‌గించే వ‌ర‌కు త‌మ పోరాటం ఆగ‌ద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాద‌వ్ పేర్కొన్నారు. ఎన్నిక‌ల వ‌ల్ల వ‌ర్గ రాజ‌కీయాల‌కు తెర‌ప‌డింద‌ని తెలిపారు. తాజా ఫ‌లితాలు ఇండియా కూట‌మికి బాధ్యత‌ను అప్పగించాయ‌న్నారు.

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం.. ఇండియా కూట‌మికి నైతిక విజ‌యాన్ని అందించింద‌న్నారు. ఉద్యోగాలు ఇవ్వాల‌ని మోదీ స‌ర్కారుకు లేద‌ని, అందుకే పేప‌ర్ లీకేజీలు అవుతున్నట్లు ఆయ‌న ఆరోపించారు. కుల గ‌ణ‌న చేప‌ట్టకుండా న్యాయం అందించ‌లేమ‌న్నారు. ఎన్నిక‌ల వేళ కొంద‌రి ప‌ట్ల ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళి విష‌యంలో ఎన్నిక‌ల సంఘం ఉదాసీనంగా ఉన్నట్లు తెలిపింది.

Tags:    

Similar News