School Holiday: విద్యార్థులకు శుభవార్త..నేడు స్కూళ్లు బంద్

Update: 2024-12-06 01:09 GMT

 

School Holiday Today: విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది సర్కార్. నేడు సూళ్లకు సెలవు ప్రకటిస్తూ తీపికబురు అందించింది. పాఠశాలలకు సెలవు వచ్చిందంటే విద్యార్థులకు పండగే పండగ. ఏపీ, తెలంగాణలోని ఏ ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ఉంది. ఈరోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నాళ్లుగా వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంగాళాఖాతలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా భారీ వ్షాలు కురుస్తున్నాయి. అయితే ఫెంగల్ తుపాన్ ప్రభావం ఏపీ, తమిళనాడు, తెలంగాణపై కూడా ఉంది. ఈ ఫెంగల్ తుఫాన్ తీరం దాటే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలోనే చెన్నై పరిసర ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ విధించింది ప్రభుత్వం. కొన్ని రోజులు చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలు కూడా వస్తున్నాయి.

ముఖ్యంగా తిరువణ్ణామలై, కళ్లకురిచ్చి, కడలూరు, విల్లుపురం వంటి జిల్లాలు ఈ తుఫాన్ ధాటికి తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి. ముఖ్యంగా నేడు పుదుచ్చేరిలోని అన్నీ స్కూల్లకు సెలవు ఇచ్చారు. ఈ ప్రాంతంలో జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతూనే ఉన్నాయి.

ఏపీలోని తీరప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి బంగాళాఖాతంలోని అల్పపీడనాల ప్రభావంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరదలు కూడా ఇళ్లలోకి వచ్చాయి. ఆయా ప్రాంతాలకు పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ నెలలో కూడా దసరా సెలవులు ఎక్కువగానే వచ్చాయి. దీపావళి సెలవులు కొన్ని ప్రాంతాల్లో రెండు రోజులు ఇచ్చారు. విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. అయితే సంక్రాంతి సెలవుల్లో కుదింపు ఉంటుందని తెలుస్తోంది.

Tags:    

Similar News