PM Modi: 'ప్రజలను సజీవంగా దహనం చేశారు..' గోద్రా అల్లర్లపై ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్!

PM Modi: తన రాజకీయ జీవితంలో రెండో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ 2002 గుజరాత్ అల్లర్లను ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద అల్లర్లు అనే అభిప్రాయం తప్పుడు సమాచారమని స్పష్టం చేశారు. అల్లర్లకు ముందు ఉగ్రవాద ఘటనల గురించి, గుజరాత్ లో గతంలో అల్లర్ల చరిత్ర ఎలా ఉందో కూడా వివరించారు. 2002 తర్వాత 22ఏళ్లలో గుజరాత్ లో ఒక్క పెద్ద అల్లర్లు కూడా జరగలేదు. రాష్ట్రం పూర్తిగా శాంతియుతంగా ఉందాన్నారు ప్రధాని మోదీ.
ఇక అల్లర్లకు సంబంధించిన ఆరోపణల గురించి మాట్లాడుతూ మోదీ ఇలా అన్నారు. ఆ సమయంలో కేంద్రంలో మా రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారు. సహజంగానే వాళ్లు మా మీద వచ్చిన ఆరోపణలను నిలబెట్టాలని చూశారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా, న్యాయవ్యవస్థ రెండుసార్లు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి మిమ్మల్ని నిర్దోషులుగా తేల్చింది. నిజమైన బాధ్యులు కోర్టుల ద్వారా శిక్ష అనుభవించారని మోదీ అన్నారు.
లెక్స్ ఫ్రిడ్ మాన్ తో జరిగిన ఈ ఇంటర్వ్యూ చాలా ఇంట్రెస్టింగ్ సాగింది. మోదీ తన బాల్యం, హిమాలయాల్లో గడిపిన రోజులు, ప్రజాజీవితంలో తన ప్రయాణం గురించి చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ఇంగ్లీష్, హిందీ, రష్యన్ భాషల్లో ఆడియో ట్రాక్స్ తో అందుబాటులో ఉంది. మోదీ ట్విట్టర్ లో ఈ సంభాషణ లింక్ ను షేర్ చేస్తూప అందరూ వినాలని కోరారు.