Sky diving: స్కై డైవింగ్ చేసిన గజేంద్ర సింగ్ షెకావత్.. 56 ఏళ్ల వయసులో మంత్రి సాహసం

Sky diving: నిపుణుడి సహాయంతో సాహసోపేతమైన ఫీట్ చేసిన షెకావత్

Update: 2024-07-13 14:45 GMT

Sky diving: స్కై డైవింగ్ చేసిన గజేంద్ర సింగ్ షెకావత్.. 56 ఏళ్ల వయసులో మంత్రి సాహసం

Sky diving: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ పెద్ద సాహసమే చేశారు. ప్రపంచ స్కై డైవింగ్ డేను పురస్కరించుకుని గగనతలంలో నుంచి ఆయన పారాచూట్‌తో కిందకు దూకారు. అయితే ఒక నిపుణుడి సాయంతో ఆయన ఈ సాహసోపేతమైన ఫీట్‌లో పాల్గొన్నారు. విమానం నుంచి వారు దూకిన కొద్ది క్షణాలకు పారాచ్యూట్‌ తెరుచుకుంది. ఆ తర్వాత మేఘాల మీద తేలియాడుతూ వారు భూమి మీదకు చేరుకున్నారు. స్కై డైవింగ్‌ను ఎంజాయ్ చేశానన్నారు గజేంద్ర సింగ్.


Tags:    

Similar News