Ration Card: రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా డబుల్ రేషన్.. ఎక్కడంటే..?

Ration Card: రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా డబుల్ రేషన్.. ఎక్కడంటే..?

Update: 2022-02-23 08:30 GMT

Ration Card: రేషన్‌ కార్డు దారులకు ఉచితంగా డబుల్ రేషన్.. ఎక్కడంటే..?

Ration Card: రేషన్‌కార్డు దారులు నెలలో ఎప్పుడైనా రెండుసార్లు ఉచిత రేషన్ అందుకున్నారా.. కానీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రజలకు ఆ అవకాశం వచ్చింది. వాస్తవానికి ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (PMGKY) కింద ఉచిత రేషన్ పంపిణీ మార్చి 2022 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేషన్‌ అందిస్తోంది. దీంతో రాష్ట్రంలోని15 కోట్ల మందికి పైగా రేషన్ కార్డు హోల్డర్లు ఉచితంగా రెట్టింపు రేషన్‌ను పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గరీబ్ కళ్యాణ్ యోజన పొడిగింపు తర్వాత ఇప్పుడు యుపిలోని అర్హులైన రేషన్ కార్డ్ హోల్డర్లు ప్రతి నెలా10 కిలోల ఉచిత రేషన్ పొందుతున్నారు.

వాస్తవానికి లబ్ధిదారులు నెలకు రెండుసార్లు గోధుమలు, బియ్యం ఉచితంగా పొందుతున్నారు. దీంతో పాటు పప్పులు, వంటనూనె, ఉప్పు కూడా ఉచితంగా ఇస్తున్నారు. నిజానికి ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అనేక ప్రకటనలు చేస్తోంది. కరోనా వైరస్ తరువాత ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఆర్థికంగా బలహీనంగా ఉన్న పేదలు, కార్మికులకు ఉచితంగా రేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. PMGKY గడువు నవంబర్‌లో ముగిసింది. అయితే యోగి ప్రభుత్వం దానిని హోలీ వరకు పొడిగించింది. ఇప్పుడు అంత్యోదయ రేషన్ కార్డుదారులు, అర్హులైన కుటుంబాలకు డిసెంబర్ నుంచి డబుల్ రేషన్ ఇస్తున్నారు.

Tags:    

Similar News