Former MLA Mahendra Yadav: కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి
Former MLA Mahendra Yadav:: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా శిక్ష అనుబవిస్తున్న, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మరణించారు.
Former MLA Mahendra Yadav:: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషిగా శిక్ష అనుబవిస్తున్న, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మరణించారు. ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ ఈ విషయాన్నీ దృవీకరించారు. 1984 సిక్కు అల్లర్ల కేసులో ఆయనకు 10 ఏళ్లు శిక్ష పడింది. దాంతో 2018 డిసెంబర్ నుంచి మండోలి జైలులోని 14వ నెంబర్ బ్యారక్‌లో ఉన్నారు. అయితే ఇదే బ్యారక్‌లో శిక్ష అనుభవిస్తున్న కన్వర్ సింగ్ అనే ఖైదీ జూన్ 15న మృతి చెందాడు. దాంతో అతని శవానికి కరోనా పరీక్ష చెయ్యగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఇదే బ్యారక్‌లో ఉంటున్న 29మంది వృద్ధ ఖైదీలకు కరోనా పరీక్షలు నిర్వహించడంతో మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్‌తో సహా 29మందికీ పాజిటివ్ ఉన్నట్టు తేలింది.
ఈ క్రమంలో మహేందర్ యాదవ్ తోపాటు పలువురు ఖైదీలను ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అయితే మహేందర్ యాదవ్ ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు జడ్జికి అభ్యర్ధించారు. దీంతో ద్వారకలోని ఆకాశ్ హెల్త్‌కేర్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. దీంతో కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ఢిల్లీలోని పాలమ్ నియోజకవర్గం నుంచి మహేందర్ యాదవ్ ఒక పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందారు.