Five State Elections Results Today: ఐదు రాష్ట్రాల్లో ఉత్కంఠకు నేటితో తెర
Five State Elections Results Today: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారనన్న ఉత్కంఠకు నేటితో తెర
Five State Elections Results Today: అత్యంత ఉక్కంఠగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాలతో పాటు ఉపఎన్నికలు జరిగిన చోట ఓట్ల లెక్కింపునకు అంతా సిద్ధమయింది. నేటి (ఆదివారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో మాస్క్‌లు, శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. కౌంటింగ్ ప్రారంభించిన కాసేపటి తర్వాత ట్రెండ్స్ తెలిసిపోతాయి. 10 గంటల కల్లా ఒక క్లారిటీ వస్తుంది. సాయంత్రం 5 గంటల తర్వాత పూర్తి స్థాయి ఫలితాలు వెలువడనున్నట్లు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ఉపఎన్నికలు జరిగాయి. ఏపీలో తిరుపతి పార్లమెంట్ స్థానానికి, తెలంగాణలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరిగింది. ఈ ఫలితాలు కూడా ఆదివారం రానున్నాయి. ఐతే తిరుపతిలో వైసీపీ, సాగర్‌లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు మొత్తం 8 దశల్లో పోలింగ్ నిర్వహించారు. 234 అసెంబ్లీ సీట్లున్న తమిళనాడు, 140 సీట్లున్న కేరళ అసెంబ్లీతో పాటు పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 6న ఒకేదశలో పోలింగ్ జరిగింది. అసోంలో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించారు. మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న పోలింగ్ నిర్వహించారు. తమిళనాడులో డీఎంకే, కేరళలో ఎల్డీఎఫ్, అసోంలో బీజేపీ, పుదుచ్చేరిలో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిల్ పోల్స్ అంచనా వేశాయి. ఐతే పశ్చిమ బెంగాల్‌పైనే అందరి దృష్టి ఉంది. బెంగాల్‌లో మమతాను ఓడించేందుకు బీజేపీ సర్వ శక్తులూ ఒడ్డింది. మెజారిటీ సర్వేలు టీఎంసీకి అనుకూలంగా ఉండగా.. మరికొన్ని బీజేపీ గెలుస్తాయని చెప్పాయి.