రైతు సంఘాల నేతలతో కేంద్రం ఏడో విడత చర్చలు ప్రారంభించింది. 40రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత అంశాలపై చర్చజరుగుతోంది. అదేవిధంగా గతంలో రెండు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయంపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు రైతు సంఘాల నేతలు. ఇక వ్యవసాయ చట్టాల అభ్యంతరాలపై అంశాల వారిగా చర్చిస్తామంటున్న కేంద్రం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన చర్చలు ఫలపద్రం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒకవేళ చర్చలు విఫలమైతే రైతుల ఆందోళనలు కొనసాగనున్నాయి.