రైతులతో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. మూడు చట్టాల రద్దుపై ప్రతిష్టంభన కొనసాగడంతో చర్చలు ఓ కొలిక్కిరాలేదు. జనవరి 15న మరోసారి చర్చలు జరుపాలని ఇరువర్గాలు నిర్ణయించాయి. చట్టాలు రాజ్యాంగ బద్ధం కాదని భావిస్తే సుప్రీంను ఆశ్రయించవచ్చుని సుప్రీంలో దాఖలైన కేసుల్లో ఇంప్లీడ్ కావాల్సిందిగా రైతు సంఘాలకు కేంద్ర మంత్రులు సూచించారు. కేంద్ర మంత్రుల సూచనను రైతు సంఘాలు కొట్టివేశాయి. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు.