Fact Check: ఆడపిల్ల ఉంటె నిజంగా కేంద్రం 24 వేలు ఇస్తుందా?
Fact check: సోషల్ మీడియాలో ఇటీవల ఇదిగో పులి.. అదిగో తోక వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.
Pradhan Mantri Kanya Ashirwad Yojana Scheme 2020 False: సోషల్ మీడియాలో ఇటీవల ఇదిగో పులి.. అదిగో తోక వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. కరోనా కష్ట కాలంలో సాధారణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇదిగో ఇదీ అలాంటిదే! సోషల్ మీడియా వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువైపోతున్న సంగతి అందరికీ తెలిసిందే ... ఏది నిజమో, ఏది అబద్ధమో తెలిసే లోపు ఆ వార్త అందరికి చేరి వైరల్ అయిపోతుంది. నిజం ఏదో తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం కూడా జరిగిపోతుంది. ఇది కూడా అలాంటి వార్తే.. ఇంతకీ ఆ వార్త ఏంటో చూద్దాం..
ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రవేశ పెట్టింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంట్లో ఆడపిల్ల ఉంటే చాలు. నెలకి రెండు వేల రూపాయలు, సంవత్సరానికి 24 వేల రూపాయలు డైరెక్టుగా బ్యాంకులోనే ఆడపిల్లల పేరిట కేంద్రం డబ్బులను జమచేస్తుంది . ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన పథకానికి దరఖాస్తు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వమే సంవత్సరానికి ఈ 24 వేల రూపాయలు ఇస్తుందంటూ ఈ న్యూస్ వార్త వాట్సాపుల్లో, పలు సోషల్ మీడియా యాప్స్‌లో తెగ వైరల్ అవుతుంది. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే భయం అక్కర్లేదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉచితంగా డబ్బులు పంచుతారని దీని సారాంశం అన్నమాట.. అంతేకాకుండా జనాలు కూడా ఇది నిజమేమోనని నమ్మి తెగ షేర్లు కూడా చేస్తున్నారు..
వాస్తవానికి అయితే 'ప్రధానమంత్రి కన్యా ఆశీర్వాద్ యోజన' పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పథకాన్ని ప్రవేశ పెట్టలేదు.. ఇదో ఫేక్ న్యూస్.. అంతేకాకుండా ఇదో అసత్యపు ప్రచారం అంటూ పీబీఐ అంటే ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఈ న్యూస్‌ని ఖండించింది. అంతేకాకుండా అలాంటి పధకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టలేదని, ఎక్కడ కూడా చెప్పలేదని స్పష్టం చేసింది. ఈసారి ఎవరైనా మీకు ఈ తప్పుడు సమాచారం పోస్ట్ చేస్తే నమ్మి మోసపోకండి అంటూ స్పష్టం చేసింది.
ఫాక్ట్ చెక్: ఇదో ఫేక్ న్యూస్.. అసలు అలాంటి పధకమే లేదు.