నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ సంస్థలకు చెందిన 2,300 కిలోల జ్యూవెలరీ స్వాధీనం

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు పంగనామాలు పెట్టి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి షాక్ తగిలింది.

Update: 2020-06-10 14:16 GMT
Nirav Modi and Mehul Choksi (file photo)

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు పంగనామాలు పెట్టి విదేశాల్లో తలదాచుకున్న నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీకి షాక్ తగిలింది. వీరిద్దరికి చెందిన సుమారు 1,350 కోట్ల రూపాయల విలువైన 2,300 కిలోల పాలిష్ వజ్రాలు, ముత్యాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం హాంగ్ కాంగ్ నుంచి తిరిగి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ముంబైలో దిగిన 108 సరుకుల్లో 32 మోడీ నియంత్రణలో ఉన్న విదేశీ సంస్థలకు చెందినవి కాగా, మిగిలినవి మెహుల్ చోక్సీ సంస్థలకు చెందినవి. వీటిలో పాలిష్ చేసిన వజ్రాలు, ముత్యాలు , వెండి ఆభరణాలు ఉన్నాయి.. వీటి విలువ 1,350 కోట్ల రూపాయలుగా అధికారులు లెక్కగట్టారు.

ఈ విలువైన వస్తువులను తిరిగి తీసుకురావడానికి హాంకాంగ్‌లోని అధికారులతో "అన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను" పూర్తి చేసిందని ఈడీ ఏజెన్సీ తెలిపింది. వీటిని ఇప్పుడు పిఎంఎల్‌ఏ కింద అధికారికంగా స్వాధీనం చేసుకుంటామని తెలిపింది. కాగా ముంబైలోని పిఎన్‌బి(పంజాబ్ నేషనల్ బ్యాంక్ ) బ్రాంచ్‌లో 2 బిలియన్‌ డాలర్లకు పైగా తీసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ. ప్రస్తుతం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద ఈ ఇద్దరు వ్యాపారవేత్తలను ఈడీ విచారిస్తోంది.


Tags:    

Similar News