జమ్మూ కాశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి.

Update: 2020-06-25 06:39 GMT

జమ్మూ కాశ్మీర్‌ లోని బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సోపోర్‌లోని హర్దశివ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ముందుగా ఉగ్రవాదులకు లొంగిపోవడానికి అవకాశం ఇచ్చారు, కాని వారు రెచ్చిపోయి భద్రతా దళాలపై కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు ఎన్ కౌంటర్ లో హతమయ్యారని తెలుస్తోంది. దీంతో కాశ్మీర్‌ లోయలో ఈ నెలలో జరిగిన పద్నాలుగో ఎన్‌కౌంటర్ ఇది.

ఇప్పటివరకు 43 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 2 రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 2 ఉగ్రవాదులు మరణించారు. ఇక బుద్గామ్‌లోని నార్బల్ ప్రాంతంలో జరిపిన ఆపరేషన్ లో 5మంది ఉగ్రవాదులను పోలీసులు, ఆర్మీ అధికారులు అరెస్టు చేశారు. ఈ బృందం లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులను దాచడానికి, వారికి ఆయుధాలను అందించడానికి పనిచేస్తున్నట్టు విచారణలో తేలింది. అరెస్టయిన వారు ఇమ్రాన్ రషీద్, ఇఫ్షాన్ అహ్మద్ ఘని, ఒవైస్ అహ్మద్, మొహ్సిన్ ఖాదీర్ , అబిద్ రాథోర్ గా తెలుస్తోంది. వారివద్ద ఎకె -47 రైఫిల్స్, 28 రౌండ్ బుల్లెట్లు, లష్కర్-ఎ-తోయిబాకు చెందిన 20 పోస్టర్లు లభించాయి.

Tags:    

Similar News