జమ్మూ కాశ్మీర్‌లో మరో ఉగ్రవాది ఎన్‌కౌంటర్
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. కుల్గాం జిల్లాలోని లిఖాది పోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు.
జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి తుపాకీ మోత మోగింది. కుల్గాం జిల్లాలోని లిఖాది పోరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. అయితే, అతను ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడో మాత్రం ఇంకా గుర్తించలేదు. ఎన్‌కౌంటర్ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు శనివారం ఆలస్యంగా తెలియజేశారు. కాగా ఈ నెల మొదటి రెండు రోజుల్లో భద్రతా దళాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను హతమార్చాయి.
వీరిలో ఐదుగురు షోపియన్‌లో, ముగ్గురు అవంతిపోరా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే మహ్మద్ కు చెందినవారు కాగా.. మొత్తం ఈ నెలలో 11 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో 35 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక ఇటీవల, పాకిస్తాన్ నుండి నడుస్తున్న నార్కో-టెర్రర్ రాకెట్ కూడా పట్టుబడింది. ఈ రాకెట్ ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో సహాయపడుతుందని అధికారులు తేల్చారు.