భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్ లో నక్సలైట్ మృతి

జార్ఖండ్ లోని కోడెర్మా అడవిలో పోలీసులు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక నక్సలైట్ ను భద్రతా దళాలు హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి ఎకె -47 ను స్వాధీనం చేసుకున్నారు.

Update: 2020-06-18 13:43 GMT

జార్ఖండ్ లోని కోడెర్మా అడవిలో పోలీసులు, నక్సలైట్‌ల మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఒక నక్సలైట్ ను భద్రతా దళాలు హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి ఎకె -47 ను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కోడెర్మా అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. అయితే మరణించిన నక్సలైట్ వివరాలను ఇంకా గుర్తించలేదు. ఈ ఆపరేషన్‌లో సిఆర్‌పిఎఫ్‌, జిల్లా పోలీసులు పాల్గొన్నారు.

నక్సలైట్లు అడవిలో పలువురిని కలుస్తున్నారని, వారు పెద్ద కుట్రకు వ్యూహం రచిస్తున్నట్లు భద్రతా దళాలకు రహస్య సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు భద్రతా దళాలు అడవిలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఇంతలో, నక్సలైట్లు భద్రతా దళాలను చూసి కాల్పులు ప్రారంభించారు. ప్రతీకారంగా భద్రతా దళాలు కూడా కాల్పులు ప్రారంభించాయి. ఈ సమయంలో భద్రతా దళాలు ఒక నక్సలైట్ ‌ను చంపాయి. కాగా మిగిలిన నక్సలైట్లు తప్పించుకున్నారు. వారికోసం భద్రతా దళాలు అడవిలో జల్లడిపట్టాయి. 


Tags:    

Similar News