ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. ముంబై NIA ఆఫీస్ కు బెదిరింపు మెయిల్..

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయబోతున్నమాంటూ వచ్చిన ఓ మెయిల్ తీవ్ర కలకలం రేపుతోంది.

Update: 2022-04-01 10:07 GMT

ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. ముంబై NIA ఆఫీస్ కు బెదిరింపు మెయిల్..

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయబోతున్నమాంటూ వచ్చిన ఓ మెయిల్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ మేరకు ఓ అగంతకుడు ఎన్ఐఏకు మెయిల్ పంపించాడు. ఇందుకోసం ఇప్పటికే ప్లాన్ సిద్ధమైందని, ఇక దాన్ని అమలుచేసేందుకు వేచి చూస్తున్నామని అగంతకుడు పేర్కొన్నాడు. పలు ఉగ్రవాద సంస్థలు ఈ ప్లాన్‌లో భాగమయ్యాయనీ తెలిపాడు. మోదీ హత్య ప్లాన్ అమలుకు ఇప్పటికే 20 మంది స్లీపర్ సెల్స్‌ను రంగంలోకి దిగారని పేర్కొన్నాడు. ఈ 20 మంది 20 కేజీల ఆర్‌డీఎక్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు.

మరో ట్విస్ట్ ఏంటంటే.. మెయిల్ చేసిన అగంతకుడు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు పేర్కొన్నాడు. దీంతో ఇక హత్య కుట్రకు సంబంధించిన ప్లాన్ బహిర్గతమయ్యే అవకాశం ఉండదని చెప్పాడు. అగంతకుడు పంపిన మెయిల్‌తో ఎన్ఐఏ అప్రమత్తమైంది. ఆ మెయిల్‌ను పలు భద్రతా విభాగాలతో పాటు సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీకి పంపించింది. ఆ మెయిల్ ఐపీ అడ్రెస్‌ను కనుగొనేందుకు సైబర్ విభాగం ప్రయత్నిస్తోంది. ఐపీ అడ్రెస్ తెలిస్తే.. ఆ మెయిల్ పంపించిన అగంతకుడి ఆచూకీని గుర్తించే అవకాశం ఉంది.



 


Tags:    

Similar News