మహారాష్ట్ర సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్ ప్రమాణ స్వీకారం
Maharashtra: గత కొన్ని రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెర పడిపోయింది.
Maharashtra: గత కొన్ని రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెర పడిపోయింది. మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. శివసేన నుంచి ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో మొదలైన సంక్షోభం తీవ్రస్థాయిలో కొనసాగడంతో నిన్న ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా రాజీనామా చేశారు. దీంతో 2019లో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలు కలిసి ఏర్పాటు చేసిన మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో గురువారం భాజపా-శివసేన రెబల్ వర్గం ఎమ్మెల్యేలు కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు.