రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. తెలుగు రాష్ట్రాల ఓటు బ్యాంకు కీలకం

President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.

Update: 2022-06-09 10:47 GMT

President Election Schedule 2022: రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ ‎కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 15 ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అప్పటి నుంచి జూన్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ, జూన్ 30 నామినేషన్ల పరిశీళన ప్రక్రియ ఉంటుంది. ఇక జూలై 2 వరకు నామినేషన్ల ఉపసంహ‍రణకు గడువు విధించారు. ఇక జూలై 18 ఎన్నిక, 21న కౌంటింగ్ జరగనుంది. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తెలిపారు.

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో వివిధ పార్టీల బలం ఎంత అని చర్చ మొదలైంది. ఎన్డీఏకు 49శాతం ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రపతి ఎన్నికలో ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం కానుంది. తెలుగు రాష్ట్రాల ఓటు బ్యాంకుపై అధికార ఎన్డీఏ దృష్టి సారించింది. టీఆర్ఎస్ ఓటు బ్యాంకు 2శాతం పైబడి ఉండటం, వైసీపీ ఓటు బ్యాంకు 4శాతం పై బడి ఉండటంతో ఈ రెండు పార్టీలు ఏయే పక్షాలకు మద్దతు పలుకుతాయి అనేది కీలకం కానుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కూటమికి అనుకూలంగా ఓటేయదనే విశ్లేషణలు వస్తున్నాయి. వైసీపీ మాత్రం గుంభనంగా ఉన్నప్పటికీ ఓటు మాత్రం చివరి నిమిషంలో ఎన్డీఏ అభ్యర్థికి వేయవచ్చు అనే కామెంట్లు వస్తున్నాయి. 

Tags:    

Similar News