Haryana: రామయ్యా.. ఈ జీవితం నీకే అంకితం.. దైవిక పాత్రలోనే ఆఖరి శ్వాస
Haryana: స్టేజిపై అటు ఇటు తిరిగి ఒక్కసారిగా నేలకూలిన వ్యక్తి
Haryana: అయోధ్యలో ప్రాణప్రతిష్ట సందర్భంగా హర్యానాలో ఏర్పాటు చేసిన నాటకంలో విషాదం చోటు చేసుకుంది. హనుమాన్ పాత్ర ధరించిన వ్యక్తి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్టేజిపై అటు ఇటు తిరిగిన వ్యక్తి అకస్మాత్తుగా కిందపడిపోయాడు. వ్యక్తి కిందపడిపోవడాన్ని గమనించిన అక్కడివారు పైకి లేపే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది.