ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రికి కరోనా పాజిటివ్
ఢిల్లీ ఆరోగ్య శాఖమంత్రి సత్యేందర్ జైన్ కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు వైద్యులు రెండోసారి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. సోమవారం రాత్రి ఆయనకు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు.
ఢిల్లీ ఆరోగ్య శాఖమంత్రి సత్యేందర్ జైన్ కరోనావైరస్ భారిన పడ్డారు. ఆయనకు వైద్యులు రెండోసారి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. సోమవారం రాత్రి ఆయనకు అధిక జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఆయన నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహించగా, కరోనా నెగిటివ్ అని వచ్చింది. అయితే లక్షణాలు మాత్రం తగ్గకపోవడంతో బుధవారం మరోసారి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆయనను ఐసోలేషన్ లో ఉంచారు.
కాగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి చెందిన ఎమ్మెల్యే అతిషికి కూడా కరోనావైరస్ సోకింది. ఇక ఆదివారం హోమ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి సత్యేందర్ జైన్ కూడా హాజరయ్యారు, ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాల్గొన్నారు.