ఢిల్లీ ఆరోగ్య మంత్రికి అస్వస్థత.. కరోనా లక్షణాలు!

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సతేంద్ర జైన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయని..

Update: 2020-06-16 05:46 GMT

ఢిల్లీ ఆరోగ్య మంత్రి సతేంద్ర జైన్ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కరోనా లక్షణాలు ఉన్నాయని.. అధిక జ్వరం ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. దీంతో ఆయనను రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయాన్నీ స్వయంగా సతేంద్ర జైన్ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. అందులో ఇలా రాశారు. 'హై గ్రేడ్ జ్వరం మరియు గత రాత్రి నా ఆక్సిజన్ స్థాయిలు అకస్మాత్తుగా పడిపోవటం వలన నేను RGSSH లో చేరాను.' అని పేర్కొన్నారు.

అయితే సత్యేందర్ జైన్ కు ఇప్పటికే కరోనా పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. అస్వస్థతకు లోనయ్యారని తెలుసుకున్న సిఎం అరవింద్ కేజ్రీవాల్.. సతేంద్ర జైన్ ఆరోగ్యాంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. అందులో "మీరు ప్రజల కోసం అవిశ్రాంతంగా పనిచేశారు. ఇప్పుడు, మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి" అని అన్నారు. కాగా ఆదివారం హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఎల్జీ అనిల్ బైజల్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, ఢిల్లీ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి పాల్గొన్నారు.


Tags:    

Similar News