కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

Weekend Lockdown: ఢిల్లీ పొల్యూషన్‌పై కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది.

Update: 2021-11-16 10:54 GMT

కాలుష్య సంక్షోభంపై ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం

Weekend Lockdown: ఢిల్లీ పొల్యూషన్‌పై కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం అత్యవసరంగా సమావేశమై కాలుష్యానికి తాత్కాలికంగా చెక్ పెట్టడంపై చర్చించాయి. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. వారం రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించింది. అలాగే వీకెండ్‌ లాక్ డౌన్ పెట్టాలని, నిర్మాణాలను, పారిశ్రామిక కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపివేయాలని సూచించింది. అయితే కోర్టు సూచన మేరకే తాము లాక్ డౌన్ విధిస్తామని మంత్రి గోపాల్ రాయ్ స్పష్టం చేశారు.

మరోవైపు పంజాబ్, హర్యానా, యూపీ, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో ఎన్‌సీఆర్‌లో వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని, నిర్మాణ పనులు నిషేధించాలని, పరిశ్రమలను కూడా మూసేయాలని సమావేశంలో ప్రతిపాదించామన్నారు. అలాగే, వాహన కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన 'రెడ్ లైట్ ఆన్, గడాఫీ ఆఫ్' ప్రచారం ఈనెల 18తో పూర్తి కానున్న నేపధ్యంలో దీనిని మరో 15 రోజులు పొడిగిస్తున్నట్టు గోపాల్ రాయ్ పేర్కొన్నారు. సెకెండ్ ఫేజ్ నవంబర్ 19 నుంచి డిసెంబర్ 3 వరకూ కొనసాగుతుందన్నారు.

Tags:    

Similar News