రాహుల్ పై వినూత్నంగా ప్రేమను చాటుకున్న ఓ బామ్మ

*రాహుల్ లో ఓ డైనమిక్ లీడర్ ని చూసిన ప్రేమ్ ముంజాల్ *రాహుల్ భార్య కోసం పది తులాల బంగారం

Update: 2022-04-06 08:31 GMT

రాహుల్ పై వినూత్నంగా ప్రేమను చాటుకున్న ఓ బామ్మ

Pushpa Manjial: సాధారణంగా అభిమాన నేతలు లేదా, యాక్టర్లు కనిపిస్తే ఫోటోలు దిగి, ఆటో గ్రాఫ్ తీసుకుని సంబరపడుతుంటాం వారిని ఆరాధిస్తాం అంతవరకే కానీ కొందరు అభిమానం చూపించే తీరే వేరుగా ఉంటుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై ఓ బామ్మ వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకుంది.అదేంటో ఇప్పుడు చూద్దాం.

శతవసంతాల కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి రాహుల్ గాంధీ పడుతున్న శ్రమని పార్టీ నేతలు గమనిస్తున్నారో లేదో గానీ ఓ బామ్మగారు మాత్రం ప్రశంసల జల్లు కురిపిస్తోంది.రాహుల్ గాంధీ అంత మంచి వ్యక్తి లేనే లేడంటోంది. డెహ్రాడూన్లో టీచర్ గా రిటైరైన పుష్పా ముంజల్ అనే బామ్మ తన తదనంతరం ఆస్తులన్నీ రాహుల్ గాంధీకే చెందాలంటూ విల్లుకూడా రాసేసింది. రాహుల్ లో గొప్పఆలోచనాపరుడనీ,అద్భుతమైన తెలివితేటలన్న వ్యక్తి అనీ మెచ్చుకుంటోంది పుష్పా ముంజల్.78 ఏళ్ల ఈ బామ్మ కు ఫిక్స్ డ్ డిపాజిట్లు, నగలు అన్నీ కలిపి 50 లక్షల వరకూ ఆస్తులున్నాయి. 23 ఏళ్లుగా డెహ్రాడూన్లోని ఓ ఓల్డే్జ్ హోమ్ లో ఉంటున్న ఈ బామ్మ రాహుల్ గాంధీ లాంటి నేత దేశానికి అవసరమని గట్టిగా చెబుతోంది.

తన ఆస్తికి అసలు వారసుడు రాహులేనంటూ లీగల్ గా విల్లు కూడా రాసి డెహ్రాడూన్ లో కాంగ్రెస్ నేత ప్రీతమ్ సింగ్ కు అందచేసింది పుష్పాముంజల్. వాటిని రాహుల్ కి అందచేయాల్సిందిగా కోరిందామె. డెహ్రాడూన్ లోని ఓల్డేజ్ హోమ్ లో ఉంటున్న ఈ బామ్మకి ముందూ వెనకా ఎవరూ లేరు. ఉన్న ఒకే ఒక్క సోదరి ఈ నిర్ణయాన్ని ప్రశంసించిందిట రాహుల్ చాలా సాదా సీదాగా సింపుల్ గా ఉంటారు. ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా మాట్లాడతారు. ఆయన్ను అందరూ అనవసరంగా ఇబ్బంది పెడుతుంటారు. రాహుల్ ఆలోచనలకు నేను ప్రభావితమయ్యాను అని పొగడ్తలు కురిపిస్తోంది ప్రేమ్ ముంజల్.

తన పది తులాల బంగారం రాహుల్ పెళ్లయ్యాక ఆయన భార్యకు ఇవ్వాలని ఆమె విల్లులో కోరింది. దేశంకోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం వారిది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశంకోసమే ప్రాణాలు వదిలారు. నెహ్రూ ఈ దేశానికి అద్భుతమైన నాయకత్వాన్ని అందించారు అని ప్రేమ్ ముంజల్ కితాబు ఇస్తోంది. తాను 9 ఏళ్ల క్రితం ఓపెన్ చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్లన్నింటికీ నామిని రాహులేనంటున్నారామె. బామ్మగారి నిర్ణయం పట్ల కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశాయి.

Tags:    

Similar News