పూజారి బరితెగింపు.. నవ దళిత దంపతుల ఆలయ ప్రవేశానికి..
Dalit Couple: రాజస్థాన్ లో దళిత సామాజిక వర్గానికి చెందిన కొత్త జంటకు అవమానం జరిగింది.
Dalit Couple: రాజస్థాన్ లో దళిత సామాజిక వర్గానికి చెందిన కొత్త జంటకు అవమానం జరిగింది. గుడిలోకి వెళ్లి కొబ్బరికాయ కొట్టాలని భావించిన ఆ జంటను అక్కడి పూజరి అడ్డుకున్నాడు. జలోర్ జిల్లాలోని అహోర్ సబ్‌డివిజన్ పరిధిలోని నీలకంఠ గ్రామంలో ఈ అమానుషం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆ పూజారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేశారు.