Cyclone Mocha: బంగ్లాదేశ్ తీరం దిశగా సైక్లోన్ మోచా
Cyclone Mocha: బంగ్లాదేశ్‌లోని ఆగ్నేయ తీరప్రాంతాన్ని వణికిస్తోన్న సైక్లోన్ మోచా
Cyclone Mocha: బంగ్లాదేశ్‌లోని ఆగ్నేయ తీరప్రాంతాన్ని అతి ప్రమాదకరమైన ఉష్ణమండల తుపాను 'సైక్లోన్ మోచా' భయం వణికిస్తోంది. ముందుగానే తీరం వెంబడి భారీ తరలింపు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. దీంతో తీరంలో నివసిస్తున్న దాదాపు అయిదు లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. గత రెండు దశాబ్దాల కాలంలో బంగ్లాదేశ్ చూసిన అతి భీకర తుపానుల్లో సైక్లోన్ మోచా ఒకటవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం నాటికి ఈ తుపాను బంగ్లాదేశ్ - మయన్మార్ సరిహద్దు దిశగా కదులుతుందని భావిస్తున్నారు. కాక్స్ బాజార్ సముద్ర నౌకాశ్రయం వద్ద పదో నంబరు హెచ్చరిక జారీచేయడంతో తరలింపు ప్రక్రియను ముమ్మరం చేశారు.