Cyclone Mocha: దక్షిణ భారతదేశంలోని తూర్పుతీర రాష్ట్రాలకు మోచా తుఫాను ముప్పు
Cyclone Mocha: చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం
Cyclone Mocha: దక్షిణ భారతదేశంలోని తూర్పుతీర రాష్ట్రాలకు మోచా తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగళాఖాతంలో తుఫాను ఏర్పడి తమిళనాడు రాజధాని చెన్నై, దాని పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని, రేపటి వరకు వాయుగుండంగా మారుతుందని తెలిపింది.
దానివల్ల ద్రోణి, ఉపరితల ఆవర్తనంతోపాటు బంగాళాఖాతంలో మోచా తుఫాన్ ఏర్పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది. వాటి ప్రభావంతో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతోపాటు ఒడిశాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.