పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్లు వస్తున్నాయా..! ఈ తప్పు అస్సలు చేయకండి..
*మొబైల్స్‌కి మెస్సేజ్‌లు పంపుతున్నారు. *ఈ లింక్‌లను ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది.
Part Time Jobs: కరోన వల్ల ఆన్‌లైన్ పేమెంట్స్ పెరిగిపోయాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఇంటర్‌నెట్ యాక్సెస్ ఉంటుంది. దీంతో పని సులువుగా జరిగిపోతుంది. అయితే అదే రీతిలో కొన్ని సమస్యలు కూడా మొదలయ్యాయి. అవేంటంటే సైబర్ మోసాలు. వీరు అమాయకులను బురడి కొట్టించి ఖాతాలో ఉన్న డబ్బులను మాయం చేస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగాలు కోల్పోయిన వారికి పార్ట్ టైం జాబ్ అంటూ నెలకు యాభై వేల నుంచి లక్ష వరకు సంపాదించవచ్చని మొబైల్స్‌కి మెస్సేజ్‌లు పంపుతున్నారు. ఈ లింక్‌లను ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ అవుతుంది. అందుకే సైబర్ దోస్త్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ ద్వారా వినియోగదారులను హెచ్చరిస్తుంది.
దేశంలో చాలా మంది నిరుద్యోగ యువత ఉద్యోగాల వెతుకులాటలో ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు పార్ట్‌టైమ్ ఉద్యోగాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. నెలకు 40-50 వేలు సంపాదించే నకిలీ ఆఫర్‌లు అందిస్తున్నారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మీ డబ్బుపై కన్నేసి ఉంచుతారు. అందుకు అనుగుణంగా మొబైల్స్‌కి మెస్సేజ్ పంపుతారు. ఇందులో ఉండే లింక్ ఓపెన్ చేస్తే అంతే సంగతులు. అకౌంట్‌లోని డబ్బు మొత్తం మాయమవుతుంది.ఇలాంటి తప్పుడు జాబ్ ఆఫర్‌ల గురించి అప్రమత్తంగా ఉండాలని సైబర్ దోస్త్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ యూనిట్ ప్రజలకు హెచ్చరిస్తోంది.
ముందుగా మీరు అలాంటి మెస్సేజ్‌లను అవైడ్ చేయండి. లింక్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ఇలాంటి మెస్సేజ్‌లకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వ్యక్తితో ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి. నిజానికి చాలా మంది ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మొదట డబ్బులు అడుగుతారు. ఆ తర్వాత డబ్బుతో మాయమైపోతారు. ఉద్యోగం కోసం ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. అలాగే తెలియని వ్యక్తులతో లావాదేవీలు జరపకండి. అలా చేయడం ద్వారా మీ వ్యక్తిగత సమాచారం సైబర్ నేరగాళ్లకు చేరుతుంది. మీ సమాచారం హ్యాక్ చేయడం ద్వారా మీ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేయవచ్చు.