CRS App ద్వారా జనన, మరణ నమోదు సులభతరం

ow to use CSR App Step By Step Guide: ఎలాంటి అవాంతరాలు లేకుండా కేవలం ఒక బటన్‌ నొక్కడం ద్వారా జనన మరణాలను నమోదు చేయడానికి వీలు కల్పించే సరికొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

Update: 2024-10-30 14:45 GMT

CRS App

How to use CSR App Step By Step Guide: ఎలాంటి అవాంతరాలు లేకుండా కేవలం ఒక బటన్‌ నొక్కడం ద్వారా జనన మరణాలను నమోదు చేయడానికి వీలు కల్పించే సరికొత్త మొబైల్‌ అప్లికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. పౌర నమోదు వ్యవస్థ (సీఆర్‌ఎస్‌) పేరుతో రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఇండియా కార్యాలయం దీనిని రూపొందించింది. ఆ యాప్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అక్టోబర్ 29న ఆవిష్కరించారు.

ప్రస్తుతం అన్నీ మొబైల్ ద్వారానే జరిగిపోతున్నాయి. మొబైల్ యాప్ ఉంటే చాలు. ఇంట్లో ఉండే అన్ని పనులూ చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఇలాంటి ఆలోచన చేసింది. కేవలం బటన్ నొక్కడం ద్వారా జనన, మరణాలను నమోదు చేసేలా ఓ మొబైల్ యాప్ తీసుకువచ్చింది.

తమ పాలనకు సాంకేతికతను అనుసంధానం చేసే క్రమంలో డిజిటల్ ఇండియా ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వం సీఆర్ఎస్ యాప్‌ను తీసుకొచ్చిందని తెలిపారు. సీఆర్ఎస్ మొబైల్ అప్లికేషన్ దరఖాస్తు సమయాన్ని బాగా తగ్గిస్తుందన్నారు అమిత్ షా. ప్రజలు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. అదే సమయంలో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా రూపొందించిన యాప్ ఇంటర్‌ఫేస్‌ను పరిచయం చేశారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో వీడియో రూపంలో పోస్ట్ చేశారు.

RBD చట్టం, 1969లోని సెక్షన్ 7 ప్రకారం ప్రతి స్థానిక ప్రాంతానికి వారి అధికార పరిధిలో జరిగిన జనన, మరణాల నమోదు కోసం రిజిస్ట్రార్‌లను నియమించారు. మునిసిపాలిటీ, పంచాయతీ, తదితర సంబంధిత రిజిస్ట్రార్‌కు 21 రోజులలోపు తెలియజేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రార్ నుంచి సర్టిఫికెట్ పొందాలి. యాక్ట్ 1969 ప్రకారం దేశంలో సంభవించే ప్రతి జననం, మరణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ జనరల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దీనిని సమన్వయం చేస్తూ ఉంటుంది. అయితే జనన, మరణాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో సాంకేతికతను ఉపయోగించి సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ తీసుకువచ్చింది కేంద్రం.

ప్రస్తుత పరిస్థితుల్లో ధ్రువపత్రాలు అనేవి చాలా తప్పనిసరిగా మారిపోయాయి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల మొదలు.. విదేశాల ప్రయాణం వరకు అన్నింటికీ గుర్తింపు కార్డులు, ధృవపత్రాలు ఉండాల్సిందే. ఇక వ్యక్తిగత గుర్తింపు కార్డుల జారీకి అయితే బర్త్ సర్టిఫికెట్.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో డెత్ సర్టిఫికెట్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఇలాంటి కీలకమైన జనన, మరణ ధ్రువపత్రాలు ఎప్పుడైనా అత్యవసరంగా కావాలంటే.. చాలా కష్టపడాల్సి ఉంటుంది. కానీ ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. కేంద్రం తీసుకువస్తున్న నూతన విధానం ద్వారా ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం మీ చేతిలోనే ఉన్న మొబైల్లో సీఎస్ఆర్ యాప్ ఓపెన్ చేసి బటన్ నొక్కడం ద్వారా వీటిని నమోదు చేయవచ్చు.

Tags:    

Similar News