Chhattisgarh: మా ఆయ‌న విడుద‌లకు చ‌ర్య‌లు తీసుకోండి- జ‌వాన్ రాకేశ్వ‌ర్ భార్య

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం ఎదురుకాల్పుల ఘటనలో మావోల బందీలో చిక్కుకున్న కోబ్రాకమాండో రాకేశ్వర్ సింగ్ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం కలవర పెడుతోంది.

Update: 2021-04-07 12:27 GMT

Chhattisgarh: మా ఆయ‌న విడుద‌లకు చ‌ర్య‌లు తీసుకోండి- జ‌వాన్ రాకేశ్వ‌ర్ భార్య

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం ఎదురుకాల్పుల ఘటనలో మావోల బందీలో చిక్కుకున్న కోబ్రాకమాండో రాకేశ్వర్ సింగ్ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం కలవర పెడుతోంది. నక్సల్స్ దాడి తర్వాత 48 గంటలు గడిచినా రాకేశ్వర్ విడుదలపై కేంద్రం ప్రయత్నించకపోవడం పట్ల బందీకుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు తమ చెరలో ఉన్న రాకేష్ బాగానే ఉన్నాడంటూ ఓ ఫోటో విడుదల చేశారు మావోలు మధ్య వర్తుల పేర్లు ప్రకటిస్తే జవాన్ విడుదలకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫోటోలో రాకేష్ ఆరోగ్యంగా, హుషారుగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడు విడుదలవుతాడన్నది స్పష్టత రాక ఆందోళన పెరుగుతోంది.

మరోవైపు మావోయిస్టుల చెరలో ఉన్న తన భర్త విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ మూడున రాకేష్ ను బందీగా చేసుకున్నప్పటి నుంచి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. శెలవులు ముగిశాక ఒకరోజు ఆలస్యంగా విధులకు వెళితే అతనిపై చర్యలు తీసుకుంటారు. మరిప్పుడు ఆయన ఆపదలో ఉంటే పట్టదా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటించి తన భర్త విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకోవడంలో కేంద్రం మీనమేషాలు లెక్కపెడుతోందంటూ రాకేశ్వర్ బంధువులు మండిపడుతున్నారు.

మరోవైపు రాకేశ్వర్ సింగ్ విడుదలకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నాలు మొదలు కాలేదు. మావోల లేఖపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటనా చేయలేదు. సాధారణంగా బందీలను విడిపించేందుకు పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాల బృందాల సేవలను వినియోగించుకుంటుంటారు. కానీ రాకేశ్వర్ సింగ్ విషయంలో ప్రభుత్వం ఏం చేయదలచుకుంది అన్నది ఇంకా స్పష్టం కాలేదు. గతంలో కిడ్నాప్ అయిన ఐఏఎస్ వినీల్ కృష్ణను విడిపించుకునేందుకు పౌర హక్కుల సంఘాలు పెద్ద పాత్ర పోషించాయి. మరిప్పుడు ప్రభుత్వ వైఖరి ఎలా ఉండనుంది అన్నది తెలీడం లేదు.

Tags:    

Similar News