Sitaram Yechury's Health Update : ఇంకా క్రిటికల్ గానే ఏచూరి ఆరోగ్యం..వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స
Sitaram Yechurys Health: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. ఆగస్టు 19వ తేదీన ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతుంది.
Sitaram Yechury Health condition : సీపీఎం(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆగస్టు 19వ తేదీన ఆయన పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన డాక్టర్ల అబ్జర్వేషన్‌లోనే ఉన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. లంగ్స్ ఇన్ఫెక్షన్‌తోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఏచూరి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఏచూరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని..చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని పార్టీ నేతలు కొన్నాళ్ల క్రితం వెల్లడించారు.
అయితే తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై ప్రకటన విడుదలయ్యింది. ఏచూరి ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు సీపీఎం పొలిట్ బ్యూరో మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. వెంటిలేటర్ సపోర్టుతో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్లు ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.
సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందిస్తూ..ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ఆయన త్వరగా కోల్కోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న నేత సీతారాం ఏచూరీ అని..వామపక్ష ఉద్యమాలకు ఏచూరి ఐకాన్ అన్నారు. ఎన్నో సమస్యలపై పోరాడిన ఏచూరి..ఇప్పుడు తన శరీరంతో పోరాడుతున్నారన్నారు నారాయణ.
ఏచూరి గురించి...
ఏపీలోని కాకినాడ వాసి అయిన ఏచూరి ప్రజా ఉద్యమాలతో జనానికి దగ్గరయ్యారు. ఏపీ విభజన సమయంలో పార్లమెంట్‌లో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై ఆయన గళమెత్తారు. అలాగే తెలంగాణ హక్కుల గురించి పోరాడారు. పార్లమెంటరీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఏచూరి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పదునైన విమర్శలతో ఎక్కుపెట్టేవారు. కమ్యూనిస్టు మహోన్నతులైన పి సుందరయ్య, ఈఎంఎస్, బీటీఆర్, హరికిషన్ సింగ్ సూర్జిత్, బసవ పున్నయ్య, జ్యోతిబసు వంటి అగ్రనేతలతో సీతారాం ఏచూరి కలిసి పనిచేశారు.